ఏప్రిల్ 24 – మే 9

ట్రాన్సిల్వేనియాలోని ఆ చీకటి పర్వతాలకు చాలా దూరంగా, ఇంగ్లాండ్‌లో జీవితం ప్రశాంతంగా సాగుతోంది.

మినా ముర్రే తన ప్రియ స్నేహితురాలు లూసీ వెస్టెన్‌రాకు ఒక ఉత్తరం రాయడానికి కూర్చున్నది.

తన చదువు గురించి , కొత్త విషయాలు నేర్చుకుంటున్న విధానం గురించి లూసీకి రాస్తున్నది.

వివాహం తర్వాత జోనాథన్ హార్కర్‌కు మంచి జీవిత భాగస్వామిగా ఉండాలని ఆమె కోరుకుంటున్నది.

అందుకే తన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కష్టపడి చదువుతున్నది.

ఆమె రాసిన మాటలు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి.

కానీ ఆ మాటల వెనుక ఒక చిన్న విషాదం దాగి ఉంది.

ఆమెకు జోనాథన్ చాలా గుర్తుకు వస్తున్నాడు.

అతని నుంచి చివరిసారి వార్త వచ్చి చాలా రోజులు అయింది.

“ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని ఆమె తనను తాను ఓదార్చుకుంటున్నది.

అయినా…

ఇంటి నుంచి అంత దూరంగా ఉన్న జోనాథన్ ఎలా ఉన్నాడో అనే ఆలోచన ఆమెను వదలడం లేదు.

కొన్ని రోజుల తర్వాత లూసీ నుంచి ఉత్తరం వచ్చింది.

ఆ ఉత్తరం మొత్తం ఆనందంతో నిండిపోయి ఉన్నది.

ఆమె జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది.

ఒకే రోజున ముగ్గురు పురుషులు ఆమెను వివాహం చేసుకుంటామని అడిగారు.

మొదటిగా ప్రేమను వ్యక్తం చేసిన వ్యక్తి డాక్టర్ జాన్ సీవర్డ్.

అతను తెలివైనవాడు.

దయ గలవాడు.

నిజాయితీ గలవాడు.

లూసీ అతన్ని గౌరవిస్తుంది.

అభిమానిస్తుంది.

కానీ ప్రేమించదు.

అందుకే అతని ప్రతిపాదనను తిరస్కరించవలసి వచ్చింది.

ఆ నిర్ణయం తీసుకోవడం ఆమెకు బాధగా అనిపించింది.

అదే రోజు రెండో వ్యక్తి కూడా ఆమెకు పెళ్లి ప్రతిపాదన చేశాడు.

అతని పేరు క్విన్సీ మోరిస్.

అతను అమెరికన్.

సాహసవంతుడు.

ఉల్లాసంగా ఉండే వ్యక్తి.

లూసీ కాదని సమాధానం చెప్పగానే అతని మనసు నొచ్చుకుంది.

అది స్పష్టంగా కనిపించింది.

అయినా అతను నవ్వుతూనే ఉన్నాడు.

ఆమెకు శుభాకాంక్షలు చెప్పాడు.

ఆమె సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు.

తన నిరాశను దాచి పెట్టి స్నేహ పూర్వకంగా ప్రవర్తించాడు.

తర్వాత మూడో వ్యక్తి వచ్చాడు.

ఆర్థర్ హోంవుడ్.

లూసీ నిజంగా ప్రేమించిన వ్యక్తి.

అతన్ని చూసిన క్షణం నుంచే ఆమె హృదయం పరవశించింది.

అందుకే సమాధానం చెప్పడానికి ఆమెకు ఒక్క క్షణం కూడా పట్టలేదు.

ఆమె ఆనందంగా చెప్పింది—

“అవును అని.”

ఆమె ఉత్తరంలో ఆ ఆనందం ప్రతి వాక్యంలో కనిపిస్తున్నది.

భవిష్యత్తు ఎంతో అందంగా కనిపిస్తున్నది.

జీవితం పరిపూర్ణంగా అనిపిస్తున్నది.

అన్నీ సరిగ్గా జరుగుతున్నట్లు అనిపిస్తున్నది.

కానీ అందరూ లూసీలా సంతోషంగా లేరు.

డాక్టర్ సీవర్డ్ ప్రేమ విఫలమైన బాధతో తిరిగి తన పనిలో మునిగిపోయాడు.

తాను నిర్వహిస్తున్న మానసిక రోగుల ఆసుపత్రిలో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించాడు.

పని చేస్తే బాధ తగ్గుతుందని అనుకున్నాడు. అన్నీ సాధారణ కేసులే.

కానీ ఒక వ్యక్తి మాత్రం అతన్ని తీవ్రంగా ఆశ్చర్యపరుస్తున్నాడు.

అతని పేరు రెన్‌ఫీల్డ్.

ఆ మనిషిలో ఏదో అసాధారణమైన విషయం ఉన్నట్లు కానవస్తున్నది.

కొన్నిసార్లు అతను చాలా ప్రశాంతంగా, తెలివిగా మాట్లాడుతాడు.

అతని మాటల్లో అర్థం ఉంటుంది.

మరికొన్ని సందర్భాల్లో అతని ప్రవర్తన పూర్తిగా విచిత్రంగా మారిపోతుంది.

రెన్‌ఫీల్డ్‌కు ఒక వింత అలవాటు ఉంది.

అతను రోజంతా ఈగలను పట్టుకుంటూ గడుపుతాడు.

చాలా ఓపికగా.

చాలా జాగ్రత్తగా.

పట్టుకున్న ఈగలను చిన్న పెట్టెల్లో ఉంచుతాడు.

వాటిని గంటల తరబడి గమనిస్తుంటాడు.

కొంతకాలానికి అతను సాలీళ్లను సేకరించడం ప్రారంభించాడు.

ఈగలను సాలీళ్లు తింటాయి.

తర్వాత అతను చిన్న పక్షులను సేకరించాడు.

ఆ పక్షులు సాలీళ్లను తింటాయి.

పెద్ద జీవిని పట్టుకున్న ప్రతిసారి రెన్‌ఫీల్డ్ చాలా సంతోషంగా కనిపిస్తాడు.

అతను ఏదో రహస్య ప్రణాళికను అనుసరిస్తున్నట్లుగా ఉంటుంది.

ఆ ప్రణాళిక అర్థం మాత్రం అతనికే తెలిసినట్లుంది.

అతన్ని డాక్టర్ సీవర్డ్ ప్రశ్నించాడు.

“ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు?” అని .

కానీ రెన్‌ఫీల్డ్ ఎప్పుడూ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

బదులుగా ఒక వింత చిరునవ్వు నవ్వుతాడు.

కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండా ఉత్సాహంగా మారిపోతాడు.

మరికొన్నిసార్లు కిటికీ బయటకు చూస్తూ నిలబడిపోతాడు.

ఎవరో వస్తున్నట్లుగా.

లేదా…

ఏదో వస్తున్నట్లుగా.

అతను ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తాడు.

రోజులు గడుస్తున్న కొద్దీ రెన్‌ఫీల్డ్ ప్రవర్తన మరింత అర్థం కాని విధంగా మారింది.

ఒక క్షణం అతను పూర్తిగా స్పష్టంగా మాట్లాడతాడు.

మరో క్షణం తనలో తానే గొణుగుతుంటాడు.

కొన్నిసార్లు చాలా అసహనంగా ఉంటాడు.

మరి కొన్నిసార్లు చిన్న పిల్లాడిలా ఆనందంగా కనిపిస్తాడు.

ఏదో ముఖ్యమైన విషయం దగ్గర పడుతోందని అతనికి ముందే తెలిసినట్లుగా.

డాక్టర్ సీవర్డ్ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా తన నోట్స్‌లో రాసుకుంటున్నాడు.

కానీ ఎంత ఎక్కువగా రెన్‌ఫీల్డ్‌ను అధ్యయనం చేస్తే, అంత తక్కువగా అతన్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు.

ఆ మనిషి ఏదో పెద్ద రహస్యంతో అనుసంధానమై ఉన్నట్లు అనిపిస్తోంది.

ఇంకా బయటపడని రహస్యం.

ఇదే సమయంలో జోనాథన్ నుంచి వార్త కోసం మినా ఎదురు చూస్తున్నది.

“అతను త్వరలో ఉత్తరం రాస్తాడు” అని తనను తాను నచ్చే చెప్పుకున్న ది…

“అతను సురక్షితంగానే ఉన్నాడు” అని అనుకుంటున్నది.

కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వేచి ఉండటం కష్టంగా ఉంటున్నది.

ఆమెకు తెలియదు…

దూరంగా పర్వతాల మధ్య…

అడవుల ఆవల…

జోనాథన్ ఇప్పటికీ డ్రాకులా కోటలో ఖైదీగా ఉన్నాడు అని.

తాను ఎప్పుడైనా తిరిగి ఇంగ్లాండ్ చేరగలనో లేదో కూడా అతనికి తెలియదు.

ఇంగ్లాండ్‌లో ఉన్న అతని అభిమానులు ఎవరికీ ఈ ప్రమాదం గురించి తెలియదు.

వాళ్లు తమ జీవితాలను కొనసాగిస్తున్నారు.

నిశ్చితార్థాలను జరుపుకుంటున్నారు.

భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు.

సంతోషకరమైన రోజుల గురించి కలలు కంటున్నారు.

వారి వైపు నెమ్మదిగా కదులుతున్న చీకటి గురించి ఏమాత్రం తెలియకుండా.

ఆ చీకటి ఇప్పటికే ప్రయాణం ప్రారంభించింది.

ట్రాన్సిల్వేనియా నీడల నుంచి.

పర్వతాల ఆవల నుంచి.

అడవుల లోతుల నుంచి.

అది నెమ్మదిగా ముందుకు వస్తున్నది.

ఎవరూ గమనించకుండా.

ఎవరూ అనుమానించకుండా.

కానీ ఎక్కువ కాలం కాదు.

త్వరలోనే…

ఆ చీకటి ఇంగ్లాండ్‌కు చేరుకుంటుంది.

అప్పుడు వారి జీవితాలు శాశ్వతంగా మారిపోతాయి.

ఈ అధ్యాయం నుంచి కథ ట్రాన్సిల్వేనియాలోని జోనాథన్ కథను మాత్రమే కాకుండా, ఇంగ్లాండ్‌లోని మినా, లూసీ, డాక్టర్ సీవర్డ్, రెన్‌ఫీల్డ్‌ల కథలను కూడా కలుపుతూ ముందుకు సాగుతుంది. ఇక్కడి నుంచి డ్రాకులా ప్రభావం ఇంగ్లాండ్‌పై పడటం ప్రారంభమవుతుంది.