మానసిక ఆసుపత్రి అంతా నిశ్శబ్దంగా ఉన్నది. రాత్రి అయింది. చీకటి పూర్తిగా కమ్ముకున్నది.
డాక్టర్ సీవర్డ్ మనసులో మాత్రం రెన్‌ఫీల్డ్ గురించిన ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి.
కొద్దిసేపటి క్రితం అతనితో జరిగిన సంభాషణ సీవర్డ్‌ను ఇంకా కలవరపెడుతున్నది.
తనను ఆసుపత్రి నుంచి వెంటనే బయటకు పంపించమని రెన్‌ఫీల్డ్ వేడుకున్నాడు.
అప్పుడు అతను పిచ్చివాడిలా మాట్లాడలేదు.
చాలా స్పష్టంగా మాట్లాడాడు.
ప్రశాంతంగా మాట్లాడాడు.
తాను అక్కడే ఉంటే ఏదో భయంకరమైన సంఘటన జరుగుతుందని హెచ్చరించాడు.
కాని సీవర్డ్ అతని మాట వినలేదు.
ఒక వైద్యుడిగా ఆలోచించాడు.
రెన్‌ఫీల్డ్ ఇంతకుముందు హింసాత్మకంగా ప్రవర్తించాడు.
ఆసుపత్రి నుంచి పారిపోయాడు.
ఇతరులపై దాడి చేశాడు.
అలాంటి వ్యక్తిని ఏదో ప్రమాదం జరుగుతుందని హెచ్చరించాడనే కారణంతో బయటకు పంపించడం సాధ్యం కాదు.
అందుకే సీవర్డ్ అతని అభ్యర్థనను తిరస్కరించాడు.కాని రెన్‌ఫీల్డ్ కళ్లలో కనిపించిన ఆ భయాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాడు.
బహుశా…
తాను అతని మాట విని ఉండవలసిందేమో.
ఆ రాత్రి కొంతసేపటి తరువాత…
రెన్‌ఫీల్డ్ గది వైపు నుంచి ఒక్కసారిగా భయంకరమైన శబ్దం వినిపించింది.
ధడేల్!
ఏదో వస్తువు చాలా బలంగా నేలపై పడినట్టుగా.
ఆ తరువాత…
పూర్తిగా నిశ్శబ్దం.
ఒక సహాయకుడు వెంటనే అక్కడికి పరుగెత్తాడు.
కొన్ని క్షణాల్లోనే అలారం మోగింది.
రెన్‌ఫీల్డ్‌కు ఏదో జరిగింది.
సీవర్డ్ పరుగెత్తుకుంటూ అతని గదికి చేరుకున్నాడు.
లోపలికి అడుగు పెట్టగానే…
భయంతో ఆగిపోయాడు.
రెన్‌ఫీల్డ్ నేలపై పడి ఉన్నాడు.
అతని శరీరం తీవ్రంగా గాయపడింది.
చుట్టూ రక్తం.
ముఖం పాలిపోయింది.
ఊపిరి చాలా బలహీనంగా ఉన్నది.
రెన్ ఫీల్డ్ ను అసాధారణ బలం ఉన్న వ్యక్తి ఎత్తి గదిలోకి విసిరేసినట్టుగా కనిపిస్తున్నది.
కాని …
తలుపు దగ్గర కాపలా ఉన్నది.
ఎవరైనా సాధారణ వ్యక్తి లోపలికి వచ్చి రెన్‌ఫీల్డ్‌పై దాడి చేసి…
ఎవరికీ కనిపించకుండా బయటకు వెళ్లడం అసాధ్యం.
సీవర్డ్ వెంటనే అతని పక్కన మోకాళ్లపై కూర్చున్నాడు.
రెన్‌ఫీల్డ్ ఇంకా బతికే ఉన్నాడు.
కాని …
కొన ఊపిరితో ఉన్నాడు .
వెంటనే వాన్ హెల్సింగ్‌ను పిలిచారు.
అతను వచ్చి రెన్‌ఫీల్డ్‌ను పరీక్షించాడు.
గాయాలు చాలా తీవ్రంగా ఉన్నాయి.
వెన్నె ముక దెబ్బతిన్నది.
తలకు బలమైన గాయం తగిలింది .
అతను బతకడం చాలా కష్టమని ఇద్దరు వైద్యులకూ అర్థమైనది.
కాని వాన్ హెల్సింగ్‌కు మరో విషయం గుర్తొచ్చింది.
రెన్‌ఫీల్డ్‌కు ఏమి జరిగిందో తెలిసి ఉండవచ్చు.
అతను మాట్లాడకుండానే చనిపోతే…
ఈ రహస్యంలో చాలా ముఖ్యమైన భాగాన్ని వారు శాశ్వతంగా తెలుసుకోలేకపోవచ్చు .
అందుకే…
ఎలాగైనా అతనిని స్పృహలోకి తీసుకురావాలి.
కొన్ని నిమిషాలైనా సరే.
వారు తీవ్రంగా ప్రయత్నించారు.
కొంతసేపటి తరువాత …
రెన్‌ఫీల్డ్ కళ్లు మెల్లగా తెరుచుకున్నాయి.
మొదట అతనికి ఏమీ అర్థం కానట్టుగా కనిపించింది.
తరువాత సీవర్డ్‌ను గుర్తుపట్టాడు.
అతని ముఖంలో తీవ్రమైన నొప్పి కనిపిస్తున్నది.
కాని …
మనసు మాత్రం పూర్తిగా స్పష్టంగా ఉన్నది.
సీవర్డ్ అతని దగ్గరగా వంగాడు.
“రెన్‌ఫీల్డ్… ఏం జరిగింది?”
రెన్‌ఫీల్డ్ మాట్లాడటానికి ప్రయత్నించాడు.
మాటలు రావడం చాలా కష్టంగా ఉన్నది.
కొన్ని క్షణాల తరువాత…
అతను నిజం చెప్పడం ప్రారంభించాడు.
డ్రాకులా తనను కలవడానికి వస్తుండేవాడని రెన్‌ఫీల్డ్ చెప్పాడు.
కాని సాధారణ మనిషిలా తలుపు తెరిచి లోపలికి వచ్చేవాడు కాదు.
కౌంట్…
కిటికీ దగ్గరకు వచ్చేవాడు.
మొదట్లో రెన్‌ఫీల్డ్ అతనిని ఎంతో ఆనందంగా స్వాగతించాడు.
ఎందుకంటే డ్రాకులా అతనికి ఎన్నో వాగ్దానాలు చేశాడు.
జీవితం.
బలం.
శక్తి.
ఎన్నో సంవత్సరాలుగా రెన్‌ఫీల్డ్‌కు జీవాన్ని తనలోకి తీసుకోవాలనే మోజు ఉన్నది.
అందుకే ఈగలను పట్టుకున్నాడు.
వాటిని సాలీడులకు తినిపించాడు.
సాలీడులను పక్షులకు తినిపించాడు.
జీవం…
ఇంకా ఎక్కువ జీవం…
అదే అతనికి కావాలి.
అలాంటి వ్యక్తికి డ్రాకులా చేసిన వాగ్దానాలు తిరస్కరించలేనివిగా అనిపించాయి.
ఈగలు, సాలీడులు, పక్షులు తనకు ఇవ్వగలిగిన దాని కంటే…
డ్రాకులా ఎన్నో రెట్లు ఎక్కువ జీవశక్తిని ఇవ్వగలడని రెన్‌ఫీల్డ్ నమ్మాడు.
అందుకే అతనిని తన “మాస్టర్” గా అంగీకరించాడు.
అతని కోసం ఎదురుచూశాడు.
అతని మాట విన్నాడు.
అతనికి విధేయుడిగా మారాడు.
కాని తరువాత …
ఏదో మారిపోయింది.
మినాను రెన్ ఫీల్డ్ కలిశాడు.
ఆమె అతని గదికి వచ్చింది.
అతనితో ఎంతో దయగా మాట్లాడింది.
చాలామంది రెన్‌ఫీల్డ్‌ను కేవలం ఒక పిచ్చివాడిగానే చూశారు.
కాని మినా అలా చూడలేదు.
అతనిని ఒక మనిషిలా గౌరవించింది.
అతని మాటలు విన్నది.
మర్యాదగా మాట్లాడింది.
అది రెన్‌ఫీల్డ్‌ను కదిలించింది.
అదే సమయంలో…
అతను మరో విషయం గమనించాడు.
ఒక భయంకరమైన విషయం.
డ్రాకులా దృష్టి మినాపై పడింది.
అది అర్థమైన క్షణం నుంచి…
మాస్టర్ చేసిన వాగ్దానాలు రెన్‌ఫీల్డ్‌కు గొప్పగా అనిపించడం మానేశాయి.
అతనికి లూసీ గుర్తొచ్చింది.
లూసీకి ఏం జరిగిందో పూర్తిగా తెలియకపోయినా…
మినాకు కూడా అలాంటిదే జరగవచ్చునని అర్థమైనది.
బహుశా చాలా కాలం తరువాత మొదటిసారిగా…
రెన్‌ఫీల్డ్ తన గురించి కాకుండా మరో మనిషి గురించి ఆలోచించాడు.
మినాను కాపాడాలని అనుకున్నాడు.
అందుకే సీవర్డ్‌ను అంతగా వేడుకున్నాడు.
తాను చికిత్స నుంచి పారిపోవాలని ప్రయత్నించలేదు.
డ్రాకులా మళ్లీ రాక ముందే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకున్నాడు.
తనకు డ్రాకులాతో ఉన్న సంబంధం…
ఏదో విధంగా మినా దగ్గరకు తీసుకెళ్లవచ్చునని అతను భయపడ్డాడు.
కాని సీవర్డ్‌కు అప్పుడు అర్థం కాలేదు.
ఎవరికీ అర్థం కాలేదు.
ఇప్పుడు…
నేలపై తీవ్ర గాయాలతో పడుకుని
రెన్‌ఫీల్డ్ వారికి నిజం చెబుతున్నాడు.
ఆ రాత్రి డ్రాకులా మళ్లీ వచ్చాడు.
ఈసారి రెన్‌ఫీల్డ్ అతనిని ఎదిరించాడు.
ఇక రె్న్ ఫీల్డ్ కి సహాయం చేయనని డ్రాకులా చెప్పాడు.
ఇక అతనిని మాస్టర్‌గా అంగీకరించనని రెన్ ఫీల్డ్ చెప్పాడు.
డ్రాకులాను ఆపడానికి ప్రయత్నించాడు.
ఒక్క క్షణం…
అందరూ పిచ్చివాడని, నిస్సహాయుడని భావించిన రెన్‌ఫీల్డ్…
కౌంట్ డ్రాకులాకు ఎదురుగా నిలబడ్డాడు.
కాని డ్రాకులా బలానికి అతను సరిపోలేదు.
అతనిపై డ్రాకులా దాడి చేశాడు.
రెన్‌ఫీల్డ్ బరువేలేనట్టుగా పైకి ఎత్తాడు డ్రాకులా .
తరువాత… బాగా బలంతో రెన్ ఫీల్డ్ నేలపైకి విసిరేశాడు డ్రాకులా .
ఇప్పుడు అతని శరీరంపై ఉన్న గాయాలు…
డ్రాకులా చేసినవే.
రెన్‌ఫీల్డ్ కథ వింటున్నప్పుడు వాన్ హెల్సింగ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది.
అతని మనసులో ఒక భయంకరమైన ఆలోచన మెరిసింది.
అతను వెంటనే అడిగాడు.
“మేడమ్ మినా ఎక్కడ ఉన్నది?”
ఆ ప్రశ్న వినగానే అందరూ నిశ్శబ్దంగా మారిపోయారు.
సీవర్డ్ అతని వైపు చూశాడు.
మినా దగ్గరలోనే జోనాథన్‌తో ఉన్న ది.
వాళ్ళు డ్రాకులా వేటలో ఎంతగా మునిగిపోయారంటే…
మినా సురక్షితంగానే ఉన్నదని భావించారు.
అప్పుడు మరో విషయం గుర్తొచ్చింది.
ఇటీవల తమ ప్రణాళికలన్నీ మినాకు చెప్పడం మానేశారు.
ఆమెను కాపాడాలనే ఉద్దేశంతోనే.
వేటకు దూరంగా ఉంచితే…
డ్రాకులా నుంచి కూడా దూరంగా ఉంటుందని అనుకున్నారు.
కాని …
డ్రాకులాకు మినా గురించి అప్పటికే తెలిసి ఉంటే?
రెన్‌ఫీల్డ్ వారిని హెచ్చరించడానికి ప్రయత్నించింది ఇదే అయితే?
వాన్ హెల్సింగ్ ఒక్క క్షణం కూడా వృథా చేయలేదు.
రెన్‌ఫీల్డ్‌ను అక్కడే వదిలి అందరూ మినా గది వైపు పరుగెత్తారు.
ఇప్పుడు ఆ భవనం పూర్తిగా వేరుగా కనిపిస్తున్నది.
ప్రతి దారి మరింత చీకటిగా ఉన్నది.
ప్రతి నీడలోనూ ఏదో ప్రమాదం దాగి ఉన్నట్టుగా అనిపిస్తున్నది.
సీవర్డ్ గుండె వేగంగా కొట్టుకుంటున్నది.
వాన్ హెల్సింగ్ ముందుకు పరుగెత్తుతున్నాడు.
ఆర్థర్, క్విన్సీ కూడా వారితో చేరారు.
చివరకు…
మినా గది దగ్గరకు చేరుకున్నారు.
తలుపు మూసి ఉన్నది.
తట్టారు.
సమాధానం లేదు.
“జోనాథన్!”
ఎలాంటి స్పందన లేదు.
“మినా!”
నిశ్శబ్దం.
వాన్ హెల్సింగ్ ముఖంలో భయం పెరిగింది.
ఇక ఆలస్యం చేయలేదు.
అందరూ కలిసి తలుపును బలవంతంగా తెరిచారు.
లోపలికి అడుగు పెట్టారు.
అప్పుడు…
తమ జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక దృశ్యాన్ని చూశారు.
జోనాథన్ మంచంపై పడి ఉన్నాడు.
స్పృహ లేదు.
గదిలో ఏదో విచిత్రమైన వాసన వస్తున్నది.
కాని మినా అతని పక్కన పడుకుని లేదు.
ఆమె నిటారుగా కూర్చుని ఉన్నది.
ఆమె వెనుక ఒక పొడవైన నల్లటి ఆకారం నిలబడి ఉన్నది.
“కౌంట్ డ్రాకులా.”
భయంకరమైన క్షణం…
ఎవరూ కదలలేకపోయారు.
ఇంతకాలం వారు వేటాడుతున్న జీవి…
ఇప్పుడు వారి కళ్ల ముందే నిలబడి ఉన్నాడు.
జోనాథన్ చెప్పిన ప్రతి మాట నిజమే.
ఆ ముఖం.
ఆ బలమైన శరీరం.
ఆ భయంకరమైన కళ్లు.
పాలిపోయిన చర్మం.
ఎలాంటి సందేహం లేదు.
ఇతనే డ్రాకులా కోటలోని రాక్షసుడు.
ఇతనే లూసీ జీవితాన్ని నాశనం చేసిన జీవి.
ఇప్పుడు…
మినా అతని చేతులలో ఉన్నది.
డ్రాకులా ఒక చేతితో మినా తలను వెనుక నుంచి పట్టుకున్నాడు.
ఆమెను తన శరీరానికి బలంగా అదిమి పట్టుకున్నాడు.
అతని ఛాతి దగ్గర దుస్తులు తెరిచి ఉన్నాయి.
అక్కడ…
రక్తం కనిపిస్తున్నది.
మినా ముఖాన్ని ఆ గాయం దగ్గరకు బలవంతంగా అదిమిపెట్టాడు డ్రాకులా.
ఆ దృశ్యం చూసి అందరూ భయంతో బిగుసుకుపోయారు .
ఎందుకంటే…
డ్రాకులా తన రక్తాన్ని మినాతో బలవంతంగా తాగిస్తున్నాడు.
ఇది లూసీపై జరిగిన దాడుల కంటే కూడా భయంకరమైనదని వారికి వెంటనే అర్థమైనది.
లూసీ విషయంలో…
డ్రాకులా ఆమె రక్తాన్ని తాగాడు.
కాని ఇప్పుడు…
తన రక్తాన్ని మినా శరీరంలోకి పంపుతున్నాడు.
వారిద్దరి మధ్య ఏదో గట్టి,
భయంకరమైన బంధాన్ని సృష్టిస్తున్నాడు.
మినా పూర్తిగా నిస్సహాయంగా ఉన్నది.
అతని పట్టు నుంచి తప్పించుకోలేకపోతున్నది.
కొన్ని అడుగుల దూరంలోనే జోనాథన్ స్పృహ లేకుండా పడుకుని ఉన్నాడు.
మొదట స్పందించింది వాన్ హెల్సింగ్.
అతను వెంటనే ఒక పవిత్రమైన వస్తువును డ్రాకులా వైపు ఎత్తాడు.
దాని ప్రభావం వెంటనే కనిపించింది.
డ్రాకులా ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు.
అతని ముఖం కోపంగా మారిపోయింది.
గదిలోకి వచ్చిన వారంతా డ్రాకులాని ద్వేషంతో చూశారు.
అతను ఒక్కొక్కరినీ చూశాడు.
ఇప్పుడు అతని ముందు ఉన్నవారు ఏమీ తెలియని భయపడే బాధితులు కాదు.
అతని రహస్య స్థావరాల్లోకి ప్రవేశించినవారు.
అతని ప్రణాళికలకు అడ్డుపడుతున్నవారు.
లూసీ వాంపైర్ జీవితాన్ని అంతం చేసినవారు. డ్రాకులా వేటాడుతున్నవారు.
డ్రాకులా కళ్లలో కోపం బాగా కనిపిస్తున్నది.
ఆర్థర్, క్విన్సీ ముందుకు దూకారు.
కాని డ్రాకులా వేగం అసాధారణమైనది.
మినాను వదిలేశాడు.
ఒక్క క్షణం వారందరిపైనా దాడి చేయబోతున్నట్టుగా కనిపించాడు డ్రాకులా.
అంతలో గదిలో గందరగోళం మొదలైనది.
విచిత్రమైన పొగమంచు కమ్ముకున్నట్టుగా అనిపించింది.
డ్రాకులా కిటికీ వైపు కదిలాడు.
వారు అతన్ని ఆపేలోపే…
చీకటిలోకి తప్పించుకున్నాడు.
అందరూ వెంటనే అతని వెనుక పరుగెత్తారు.
కాని …
డ్రాకులా మాయమైపోయాడు.
కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు.
అప్పుడు మినా ఏడుపు వినిపించింది.
జోనాథన్ కూడా నెమ్మదిగా స్పృహలోకి వస్తున్నాడు.
అతను అయోమయంగా చుట్టూ చూశాడు.
తరువాత అతని కళ్లు మినాపై పడ్డాయి.
రక్తం కనిపించింది.
ఆమె ముఖంలో భయం కనిపించింది.
ఏదో భయంకరమైన సంఘటన జరిగిందని వెంటనే అర్థమైనది.
అతను మినా దగ్గరకు పరుగెత్తాడు.
అంతే…
మినా పూర్తిగా నిస్సహాయంగా ఉన్నది .
ఏమి జరిగిందో చెప్పడానికి ప్రయత్నించింది.
ఒక్కో మాట చాలా కష్టంగా బయటకు వస్తున్నది.
వారు నిద్రపోతున్నప్పుడు డ్రాకులా గదిలోకి వచ్చాడు.
జోనాథన్‌ను అసహజమైన గాఢ నిద్రలోకి నెట్టేశాడు.
మినా కళ్లు తెరిచే సరికి
కౌంట్ అక్కడే ఉన్నాడు.
ఆమె సహాయం కోసం అరవలేకపోయింది.
అతనిని ఎదిరించలేకపోయింది.
మొదట…
డ్రాకులా ఆమె రక్తాన్ని తాగాడు.
తరువాత తన ఛాతిపై గాయం చేసుకున్నాడు.
మినా ముఖాన్ని ఆ గాయం దగ్గరకు బలవంతంగా అదిమిపెట్టాడు.
తన రక్తాన్ని ఆమెతో మింగించాడు.
మినా పోరాడింది.
తప్పించుకోవడానికి ప్రయత్నించింది.
కాని …
ఆమె వల్ల కాలేదు.
జోనాథన్ భయంతో వింటూ ఉండిపోయాడు.
ట్రాన్సిల్వేనియాలో తాను ఎలాగో తప్పించుకున్న ఆ రాక్షసుడు…
ఇప్పుడు తన భార్యపై దాడి చేశాడు.
డ్రాకులాపై జోనాథన్‌కు ఒకప్పుడు ఉన్న భయం…
ఇప్పుడు మరింత ఎక్కువ అయింది.
ద్వేషం కూడా కలిగింది
అతను మినాను గట్టిగా కౌగిలించుకున్నాడు.
ఆమె శరీరం వణుకుతున్నది.
జరిగిన సంఘటన ఆమెకు సిగ్గుగా, అసహ్యంగా అనిపిస్తున్నది.
కాని జోనాథన్ ఆమె నుంచి దూరంగా జరగలేదు.
ఆమె పక్కనే ఉన్నాడు.
మిగతా వారు కూడా చుట్టూ చేరారు.
ఎవరూ మినాను తప్పుపట్టలేదు.
ఆమెపై దాడి జరిగిందని వారికి తెలుసు.
డ్రాకులా ఆమెను బలవంతం చేశాడని తెలుసు.
కాని …
వారందరి మనసులో ఒక భయంకరమైన ప్రశ్న ఉన్నది.
ఎవరూ బయటకు చెప్పడానికి ఇష్టపడని ప్రశ్న.
డ్రాకులా మినాను ఏమి చేశాడు?
వాన్ హెల్సింగ్ తీవ్రంగా ఆందోళన చెందాడు.
డ్రాకులా, మినా మధ్య జరిగిన ఈ రక్త మార్పిడి…
వారిద్దరి మధ్య ఏదో విచిత్రమైన బంధాన్ని సృష్టించి ఉండవచ్చు.
డ్రాకులా దాడులు కొనసాగితే…
మినాకు కూడా లూసీకి జరిగిన పరిస్థితే రావచ్చు.
బహుశా…
అంతకంటే ఘోరమైనది కూడా.
లూసీ చనిపోయిన తరువాత అన్‌డెడ్‌గా మారింది.
కాని మినా పరిస్థితి వేరు.
ఆమె ఇంకా బతికే ఉన్నది.
అయినా…
డ్రాకులా రక్తం ఇప్పుడు ఆమె శరీరంలోకి వెళ్లింది.
దాని అర్థం ఏమిటో…
ఎవరికీ పూర్తిగా తెలియదు.
వాన్ హెల్సింగ్ ఒక విషయం పరీక్షించాలని నిర్ణయించాడు.
ఒక పవిత్రమైన వస్తువును తీసుకున్నాడు.
చాలా జాగ్రత్తగా…
మినా నుదుటిపై తాకించాడు.
వెంటనే…
మినా బాధతో కేక వేసింది.
ఆ పవిత్రమైన వస్తువు ఆమె చర్మాన్ని కాల్చింది.
వాన్ హెల్సింగ్ దాన్ని తీసేసినప్పుడు…
మినా నుదుటిపై ఒక గుర్తు మిగిలిపోయింది.
అందరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు.
మినాకు దాని అర్థం తెలిసిపోయింది.
డ్రాకులాకు సంబంధించిన ఏదో తన శరీరంలోకి ఇప్పటికే ప్రవేశించింది.
ఆమె కన్నీళ్లు పెట్టుకున్నది.
నొప్పి వల్ల కాదు.
ఆ గుర్తు చెబుతున్న నిజం వల్ల.
తాను అపవిత్రంగా మారిపోయానేమోనని భయపడింది.
చివరకు…
తాను కూడా లూసీలా మారిపోతానేమోనని భయపడింది.
జోనాథన్ ఆమెను గట్టిగా పట్టుకున్నాడు.
ఆమె నిరాశ చెందడానికి అతను ఒప్పుకోలేదు.
డ్రాకులా ఏమి చేసినా…
వారు దానితో పోరాడతారు.
అతనిని కనుగొంటారు.
నాశనం చేస్తారు.
మినాను అతని ప్రభావం నుంచి కాపాడతారు .
మిగతా వారు కూడా మనసులో అదే నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు ఈ వేట పూర్తిగా మారిపోయింది.
ఇంతకుముందు…
లూసీకి జరిగిన దానికి ప్రతీకారంగా డ్రాకులాను నాశనం చేయాలనుకున్నారు.
ఇప్పుడు…
మినా ప్రాణమే దానిపై ఆధారపడి ఉండవచ్చు.
వారు ఓడిపోలేరు.
అప్పుడు వారికి రెన్‌ఫీల్డ్ గుర్తొచ్చాడు.
అందరూ వెంటనే అతని దగ్గరకు తిరిగి వెళ్లారు.
కాని అతని శక్తి వేగంగా తగ్గిపోతున్నది.
ఒకప్పుడు డ్రాకులాను మాస్టర్‌గా ఆరాధించిన వ్యక్తి…
చివరకు అతన్ని ఎదిరించినందుకు భారీ మూల్యం చెల్లించాడు.
రెన్‌ఫీల్డ్ వారిని హెచ్చరించడానికి ప్రయత్నించాడు.
సహాయం కోసం వేడుకున్నాడు.
చివరికి…
డ్రాకులాతో స్వయంగా పోరాడటానికి కూడా ప్రయత్నించాడు.
కాని ఇప్పుడు వైద్యులు చేయగలిగింది ఏమీ లేదు.
గాయాలు చాలా తీవ్రమైనవి.
కొద్దిసేపటికి…
రెన్‌ఫీల్డ్ మరణించాడు.
ఆ మరణం సీవర్డ్‌ను తీవ్రంగా కదిలించింది.
నెలల తరబడి అతను రెన్‌ఫీల్డ్‌ను ఒక వైద్య కేసుగా పరిశీలించాడు.
అతని విచిత్రమైన అలవాట్ల గురించి రాశాడు.
అతని పిచ్చి గురించి.
హింసాత్మక ప్రవర్తన గురించి.
జీవశక్తిపై ఉన్న మోజు గురించి.
కాని ఇప్పుడు…
సీవర్డ్ అతన్ని వేరేలా చూస్తున్నాడు.
రెన్‌ఫీల్డ్ కేవలం ఒక వైద్య పుస్తకంలోని కేసు కాదు.
చివరి క్షణాల్లో…
అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు.
డ్రాకులా శక్తి ఎంతటిదో అతనికి తెలుసు.
అతనిని ఎదిరిస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు.
అయినా…
ఎదిరించాడు.
మినాను కాపాడటానికి ప్రయత్నించాడు.
దానికి తన ప్రాణాన్నే మూల్యంగా చెల్లించాడు.
అందరూ మళ్లీ ఒకచోట చేరారు.
ఇప్పుడు ఎవరికీ నిద్ర గురించి ఆలోచన కూడా లేదు.
ఈ ఒక్క రాత్రి…
అన్నింటినీ మార్చేసింది.
తనను వారు వేటాడుతున్నారని డ్రాకులాకు తెలుసు.
వారు ఎవరో తెలుసు.
వారు ఎక్కడ ఉంటున్నారో తెలుసు.
తన విశ్రాంతి ప్రదేశాలను వారు నాశనం చేస్తుంటే…
తాను దాక్కుని చూస్తూ ఉండనని కూడా చూపించాడు.
డ్రాకులా తిరిగి పోరాడుతున్నాడు.
జోనాథన్‌కు దగ్గరగా మినా కూర్చున్నది.
ఆమె నుదుటిపై కాలిన గుర్తు ఇంకా అలాగే ఉన్నది.
సమయం వేగంగా గడిచిపోతున్నదని గుర్తుచేసే భయంకరమైన గుర్తు అది.
మినా పరిస్థితి మరింత దిగజారక ముందే డ్రాకులాను నాశనం చేయాలని వాన్ హెల్సింగ్ చెప్పాడు.
డ్రాకులా చనిపోతే…
వారిద్దరి మధ్య ఏర్పడిన ఆ భయంకరమైన బంధం తెగిపోతుందనే ఆశ ఉన్నది.
కాని వారు విఫలమైతే…
ఆ ఆలోచనను కూడా ఎవరూ పూర్తి చేయాలనుకోలేదు.
జోనాథన్‌కు ఇప్పుడు ఈ వేట మరింత వ్యక్తిగతమైనది.
ఒకప్పుడు డ్రాకులా అతనిని బందీ చేశాడు.
తరువాత ఇంగ్లాండ్‌కు వచ్చి లూసీని నాశనం చేశాడు.
ఇప్పుడు…
మినాపై దాడి చేశాడు.
జోనాథన్‌లో ఉన్న భయం నెమ్మదిగా మాయమవుతున్నది.
దాని స్థానంలో ఒక బలమైన నిర్ణయం జరగబోతున్నది.
డ్రాకులా ఎక్కడికి వెళ్లినా అతనిని వెంబడించాలి.
లండన్‌లో అయినా.
సముద్రం దాటి అయినా.
అవసరమైతే…
మళ్లీ ట్రాన్సిల్వేనియా పర్వతాల వరకూ అయినా.
అతను ఆగడు.
అదే సమయంలో వాన్ హెల్సింగ్‌కు మరో విషయం అర్థమైనది.
డ్రాకులా ఒక పెద్ద తప్పు చేసి ఉండవచ్చు.
మినాపై ఈ విధంగా దాడి చేయడం ద్వారా…
వారిద్దరి మధ్య ఒక బంధాన్ని సృష్టించాడు.
ఆ బంధం చాలా ప్రమాదకరమైనది.
కాని …
అది రెండు వైపులా పనిచేస్తే?
మినాపై డ్రాకులా ప్రభావం చూపగలిగితే…
బహుశా మినా ద్వారా డ్రాకులా ఎక్కడున్నాడో కూడా తెలుసుకోవచ్చునేమో.
భయంతో నిండిన ఆ రాత్రిలో…
అది వారికి కనిపించిన చిన్న ఆశ.
తెల్లవారుజాము కావస్తున్నది.
బయట చీకటి నెమ్మదిగా తగ్గుతున్నది.
కాని మానసిక ఆసుపత్రిలో ఉన్న ఎవరికీ సురక్షితంగా ఉన్నామనే భావన లేదు.
రెన్‌ఫీల్డ్ చనిపోయాడు.
మినాపై దాడి జరిగింది.
జోనాథన్ పూర్తిగా కుంగిపోయాడు.
డ్రాకులా తప్పించుకున్నాడు.
అయినా…
మరో విషయం కూడా మారిపోయింది. ఇంతకు ముందు వారు డ్రాకులా ఒక దుష్టశక్తి అని తెలుసుకుని అతనిని వేటాడుతున్నారు.
కాని ఇప్పుడు…
డ్రాకులా కూడా వారితో యుద్ధం చేస్తున్నాడని వారికి అర్థమైనది.
ఇది కేవలం వేట కాదు.
“ఇది యుద్ధం.”
ఆ యుద్ధంలో ఇప్పుడు మినా ప్రాణం కూడా భాగమైనది.
ఎక్కడో లండన్‌లో…
డ్రాకులా దాక్కుని ఉన్నాడు.
తన శత్రువులపై దాడి చేశాడు.
మినాపై తన గుర్తు వేశాడు.
ఇప్పుడు ఆమెపై తనకు మరింత శక్తి వచ్చిందని అతను భావిస్తూ ఉండవచ్చు.
కాని …
ఆ దాడి ద్వారా అతను వేటగాళ్లకు ఇంతకుముందు లేని ఒక అవకాశాన్ని కూడా ఇచ్చాడు.
తనతో నేరుగా కలిపే ఒక బంధాన్ని.
ఆ బంధాన్ని ఎలా ఉపయోగించాలో వాన్ హెల్సింగ్ కనుగొనగలిగితే…
డ్రాకులా త్వరలోనే ఒక విషయం తెలుసుకోబోతున్నాడు.
తన శత్రువులపై చేసిన అత్యంత క్రూరమైన దాడే…
తనకు అతి పెద్ద ప్రమాదాన్ని కూడా సృష్టించివచ్చు.

