రచయితలు
మా పత్రికలో రచనలు అందిస్తున్న ప్రతిభావంతులైన రచయితలు

కదంబం
కదంబం సంపాదక బృందం
యం.వి.రామారావు
ఉదయం,వార్త,ఆంధ్ర జ్యోతి పత్రికల్లో సంపాదకవర్గంలో పని చేసారు. ప్రస్తుతం రాజకీయ,సామాజిక,సాహిత్య,ఆధ్యాత్మిక విశ్లేషకులుగా పలు పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు.
ఎం.వి. రమేష్
కోస్తావాణి, వార్త, గ్రేటర్ న్యూస్ పత్రికలలో ఉపసంపాదకులుగా పనిచేశారు. అనేక రాజకీయ ,ఆధ్యాత్మిక, సాహిత్య విశ్లేషణలతో పాటు వ్యాసాలు రచించారు
యామిజాల జగదీష్
ఉదయం, ఆంధ్రజ్యోతి, వార్త, జెమినీ న్యూస్, సాక్షి పత్రికలో పని చేశారు.. బుజ్జాయి అనే పిల్లల మాసపత్రికకు ఆరున్నరేళ్ళు ఎడిటర్ గా కొనసాగారు.
వాసం నాగరాజు
ఇప్పటివరకు అన్ని ప్రింటు, వెబ్ మ్యాగజైన్ లలో కలిపి 16000 కార్టూన్లు ప్రచురితం అయ్యాయి. ప్రస్తుతం ప్రజాకలం దినపత్రిక, దక్షిణ్ టైమ్స్ లకు కార్టూన్ వేస్తున్నారు. తెలుగులో ప్రముఖ పత్రికలు నిర్వహించిన కార్టూన్ పోటీలలో సుమారుగా 90 బహుమతులు గెలుచుకున్నారు. హాస్యానందం మాసపత్రిక నిర్వహించే తలిశెట్టి రామారావు అవార్డు పోటీలలో ఒకసారి ప్రథమ బహుమతి, ఏడుసార్లు ప్రోత్సాహక బహుమతులు పొందారు. కార్టూన్ వాచ్ పత్రిక వారు చత్తీస్ గఢ్ నుంచి నిర్వహించే జాతీయ స్థాయి పోటీలలో ఇప్పటివరకు ఆరుసార్లు బహుమతి అందుకున్నారు. ఇటీవలే 200 కార్టూన్లతో ఒక పుస్తకాన్ని విడుదల చేశారు.
డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి
సుమారు నాలుగున్నర దశాబ్దాల పాత్రికేయ అనుభవం. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో సంపాదక విభాగంలో సేవలు అందించారు. ప్రస్తుతం ‘జాగృతి’ తెలుగు జాతీయవార పత్రిక సంపాదకమండలి సలహాదారుగా సేవలు అందిస్తున్నారు.
విష్ణుభట్ల మల్లికార్జున శాస్త్రి
ఎం.ఎ. ఇంగ్లీషు, బి.ఎడ్. చేశారు. ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశారు. తెలుగు భాష, చరిత్ర, ఇతిహాసాలు, పురాణాలపై క్విజ్ నిర్వహించడంలో ఎంతో అనుభవం.
కృష్ణారావు చొప్పరపు
ఎం. ఏ ( ఎకనామిక్స్ ) చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా రంగాలలో 42 సంవత్సరాలు పని చేశారు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి దినపత్రికలతో పాటు టీవీ-9, 10 టీవీ, హెచ్ఎమ్ టీవీలలో స్పోర్ట్స్ ఎడిటర్ గా, స్నేహా టీవీలో అవుట్ పుట్ ఎడిటర్ గా ఉన్నారు. క్రీడలకు సంబంధించి ఐదు వేలకు పైగా వ్యాసాలు, సానియా మీర్జా, సచిన్ టెండుల్కర్ లపై పుస్తకాలు వ్రాశారు. టీవీ9, 10 టీవీ, హెచ్ఎమ్ టీవీలలో 200కు పైగా క్రీడా కార్యక్రమాలు రూపొందించారు. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్ కేంద్రాల ద్వారా పదేళ్లపాటు క్రీడా కార్యక్రమాల సమర్పణ. సికింద్రాబాద్ నగరం 200 సంవత్సరాల వేడుకల సందర్భంగా సత్కారం, టీవీ9 స్పోర్ట్స్ ప్రొడ్యూసర్ గా రెండుసార్లు ఎన్డీ అవార్డులు.
కె.వి. గోపాలకృష్ణ
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ లో ఉంటారు. టెన్నిస్ ఆడతారు. ఖాళీ సమయాల్లో వివిధ అంతర్జాతీయ క్రీడలను ఆసక్తిగా వీక్షించడం అభిరుచి. క్రీడలు, సాంకేతిక అంశాలపై వ్యాసాలు రాస్తుంటారు.
లక్కరాజు పద్మావతి (కూచిమంచి)
ఆంధ్రప్రభ,ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఉప సంపాదకురాలిగా పని చేశారు . తెలుగులో అనేక రచనలు చేశారు.
గంటి ఆశ పద్మిని
ఇప్పటివరకు 30 కథలు, ఐదు పుస్తక సమీక్షలు, పది బాల గేయాలు, ఒక మినీ నవల రాశారు. ఈమె కథలు ఈనాడు, విశ్వభవిష్యత్, రేపటి కోసం దిన పత్రికల్లో, సుమబాల, ఉషాబాల, బాలబాట అనే మ్యాగజైన్ లలో కూడా ప్రచురితమయ్యాయి. పిల్లల కథలు ఎక్కువగా రాస్తారు
చెంగల్వ రామలక్ష్మి, బొడ్డపాటి చంద్రశేఖర్
చెంగల్వ రామలక్ష్మి — తెలుగు లెక్చరర్. గురజాడ రచనలపై డాక్టరేట్ చేశారు. కథలు, కవితలు, వ్యాసాలు రాస్తారు. ప్రస్తుతం సాక్షిలో “జ్యోతిర్మయం” శీర్షికకు రచనలు చేస్తున్నారు. బొడ్డపాటి చంద్రశేఖర్ — ఆంగ్ల ఉపన్యాసకులు. ఈనాడులో “అంతర్యామి” శీర్షికకు రచనలు చేస్తున్నారు. పుస్తక సమీక్షకులు, ఆంధ్ర–ఆంగ్ల సాహిత్య వ్యాసకర్త
డా. ఎమ్మెస్వీ సత్యనారాయణ బాబు (కపర్ది)
ఆంధ్రపత్రిక, ఉదయం, ఆంధ్రభూమి, వనితా జ్యోతి, డెక్కన్ క్రానికల్, కోస్తా ప్రభ, పల్లెబాట, వార్త దినపత్రిక ఉపసంపాదకులుగా పనిచేసిన అనుభవం. తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు నాటకరంగ విజ్ఞాన సర్వస్వం రచయితలలో ఒకరు. గోసేవకులు.
డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
తెలుగు లెక్చరర్. గురజాడ రచనలపై డాక్టరేట్ చేశారు. కథలు, కవితలు, వ్యాసాలు రాస్తారు. ప్రస్తుతం సాక్షిలో “జ్యోతిర్మయం” శీర్షికకు రచనలు చేస్తున్నారు.
మందరపు హైమవతి
స్త్రీవాద కవయిత్రి. ఆవిడ రచనలు నిషిద్ధాక్షరి, నీలి గోరింట, రాతి చెయ్యి కవితా సంపుటాలు. ఆవిడ కవితలు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ, మళయాళ, బెంగాలీ భాషల్లో అనువాదమయ్యాయి. ఆవిడ కవితా సంపుటాలకు ఫ్రీవర్శ్ ఫ్రంట్ అవార్డు, నారాయణ రెడ్డి అవార్డు, శ్రీ కాంత్ శర్మ అవార్డులు వచ్చాయి.సాహిత్య అకాడమీ ఢిల్లీ, గౌహతి, కేరళలో నిర్వహించిన అనేక కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు.
మాడుగుల రామకృష్ణ
ఎం.ఏ (సోషియాలజీ), జర్నలిజంలో పి. జి. డిప్లొమా చేశారు. ఆకాశవాణిలో 36 సంవత్సరాలు పనిచేశారు. మొదటి నుంచి హాస్యం అంటే ఉన్న అభిరుచి మేరకు రేడియోలో హాస్య నాటికలు, కథలు, ప్రహసనాలు, గల్పికలు రచించారు. రంగస్థలంపై కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట కందుకూరి అవార్డు గ్రహీత
మొలుగు కమలాకాంత్
ఎల్ఐసీలో ఆఫీసర్ గా పనిచేశారు. ఇప్పటికి 50కి పైగా కథలు రాశారు. విజయవాడ హాసం క్లబ్ 2010 లో ప్రారంభించారు. ప్రతి మూడవ శనివారం హాస్య, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు
సర్వజిత్
వృత్తి జర్నలిజం. ప్రవృత్తి రచనా వ్యాసంగం. పేరు పెండ్యాల సూర్యనారాయణ. 'సర్వజిత్' అనే కలం పేరుతో రచనలు చేస్తుంటారు. 80 కథలు, 20 నవలలు, కొన్ని కవితలూ రాశారు. స్వాతి, ఆంధ్రభూమి దిన, వార, మాస పత్రికల్లో నవలలు సీరియల్స్ గా వచ్చాయి. దాదాపు అన్ని పత్రికల్లో కథలు వచ్చాయి. రెండు కథా సంకలనాలు (ఉన్నదంతే, నిరీక్షణ), కవితా సంకలనం(కాలంతో పరుగు) వెలువడ్డాయి.
తుమ్మా బాలగంగాధరరావు
ఇరవైకి పైగా కథలు, పది వరకు నాటికలు రచించారు. వీటిలో కొన్ని ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. కవిత్వం, రంగస్థల నటనపై ఆసక్తితో పాటు సినిమాలు, దూరదర్శన్ ధారావాహికలు, టెలీఫిల్మ్‌లలో నటించారు. అనేక సామాజిక, సేవా, సాంస్కృతిక, సాహిత్య సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించడం, హాలీవుడ్ సినిమాల కథలను తెలుగులో పరిచయం చేయడం వీరి అభిరుచులు
దుర్గరాజు స్వాతి
విశాలాంధ్ర, వార్త, సూర్య, ఆంధ్రభూమి పత్రికలలో 25 సంవత్సరాలు పనిచేశారు. పత్రికలకు అనేక వ్యాసాలు రాశారు.
బొడ్డపాటి చంద్రశేఖర్
బొడ్డపాటి మురళీధర్
రిటైర్డ్ ఆటో మొబైల్ బ్రాంచి మేనేజర్, కొద్దికాలం లక్ష్మీఫిలింస్ లో పనిచేశారు. పాత తరం సినీ ప్రముఖులతో వ్యక్తిగత పరిచయాలు ఉండేవి. సాహిత్యాభిలాషి.
మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
స్టేట్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేశారు. అనేక కథలు, కవితలు, వ్యాసాలు రాశారు
వేమూరి రాజేష్
కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామానికి చెందిన రాజేష్ వేమూరి ప్రింటింగ్ టెక్నాలజీలో పట్టభద్రులై, పోలాండ్ మరియు దుబాయ్‌లో ఉద్యోగ జీవితం కొనసాగించారు. యాత్రలు, చరిత్రపై ఆసక్తితో “నా ఐరోపా యాత్ర”, “మా కాకసస్ యాత్ర” వంటి గ్రంథాలు రచించారు. ఘంటసాల గ్రామ చరిత్ర, విశేషాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రామస్థులకు చేరవేయాలనే లక్ష్యంతో www.managhantasala.net వెబ్‌సైట్‌ను స్థాపించి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం Fortune Pack సంస్థ ద్వారా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు
