రచయితలు

మా పత్రికలో రచనలు అందిస్తున్న ప్రతిభావంతులైన రచయితలు

కదంబం

కదంబం సంపాదక బృందం

19రచనలు

యం.వి.రామారావు

ఉదయం,వార్త,ఆంధ్ర జ్యోతి పత్రికల్లో సంపాదకవర్గంలో పని చేసారు. ప్రస్తుతం రాజకీయ,సామాజిక,సాహిత్య,ఆధ్యాత్మిక విశ్లేషకులుగా పలు పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు.

7రచనలు

ఎం.వి. రమేష్

కోస్తావాణి, వార్త, గ్రేటర్ న్యూస్ పత్రికలలో ఉపసంపాదకులుగా పనిచేశారు. అనేక రాజకీయ ,ఆధ్యాత్మిక, సాహిత్య విశ్లేషణలతో పాటు వ్యాసాలు రచించారు

6రచనలు

డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి

సుమారు నాలుగున్నర దశాబ్దాల పాత్రికేయ అనుభవం. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో సంపాదక విభాగంలో సేవలు అందించారు. ప్రస్తుతం ‘జాగృతి’ తెలుగు జాతీయవార పత్రిక సంపాదకమండలి సలహాదారుగా సేవలు అందిస్తున్నారు.

5రచనలు

యామిజాల జగదీష్

ఉదయం, ఆంధ్రజ్యోతి, వార్త, జెమినీ న్యూస్, సాక్షి పత్రికలో పని చేశారు.. బుజ్జాయి అనే పిల్లల మాసపత్రికకు ఆరున్నరేళ్ళు ఎడిటర్ గా కొనసాగారు.

5రచనలు

లక్కరాజు పద్మావతి (కూచిమంచి)

ఆంధ్రప్రభ,ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఉప సంపాదకురాలిగా పని చేశారు . తెలుగులో అనేక రచనలు చేశారు.

3రచనలు

చెంగల్వ రామలక్ష్మి, బొడ్డపాటి చంద్రశేఖర్

చెంగల్వ రామలక్ష్మి — తెలుగు లెక్చరర్‌. గురజాడ రచనలపై డాక్టరేట్‌ చేశారు. కథలు, కవితలు, వ్యాసాలు రాస్తారు. ప్రస్తుతం సాక్షిలో “జ్యోతిర్మయం” శీర్షికకు రచనలు చేస్తున్నారు. బొడ్డపాటి చంద్రశేఖర్‌ — ఆంగ్ల ఉపన్యాసకులు. ఈనాడులో “అంతర్యామి” శీర్షికకు రచనలు చేస్తున్నారు. పుస్తక సమీక్షకులు, ఆంధ్ర–ఆంగ్ల సాహిత్య వ్యాసకర్త

2రచనలు

డా. ఎమ్మెస్వీ సత్యనారాయణ బాబు (కపర్ది)

ఆంధ్రపత్రిక, ఉదయం, ఆంధ్రభూమి, వనితా జ్యోతి, డెక్కన్ క్రానికల్, కోస్తా ప్రభ, పల్లెబాట, వార్త దినపత్రిక ఉపసంపాదకులుగా పనిచేసిన అనుభవం. తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు నాటకరంగ విజ్ఞాన సర్వస్వం రచయితలలో ఒకరు. గోసేవకులు.

2రచనలు

సర్వజిత్

వృత్తి జర్నలిజం. ప్రవృత్తి రచనా వ్యాసంగం. పేరు పెండ్యాల సూర్యనారాయణ. 'సర్వజిత్' అనే కలం పేరుతో రచనలు చేస్తుంటారు. 80 కథలు, 20 నవలలు, కొన్ని కవితలూ రాశారు. స్వాతి, ఆంధ్రభూమి దిన, వార, మాస పత్రికల్లో నవలలు సీరియల్స్ గా వచ్చాయి. దాదాపు అన్ని పత్రికల్లో కథలు వచ్చాయి. రెండు కథా సంకలనాలు (ఉన్నదంతే, నిరీక్షణ), కవితా సంకలనం(కాలంతో పరుగు) వెలువడ్డాయి.

2రచనలు

డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి

తెలుగు లెక్చరర్‌. గురజాడ రచనలపై డాక్టరేట్‌ చేశారు. కథలు, కవితలు, వ్యాసాలు రాస్తారు. ప్రస్తుతం సాక్షిలో “జ్యోతిర్మయం” శీర్షికకు రచనలు చేస్తున్నారు.

1రచనలు

దుర్గరాజు స్వాతి

విశాలాంధ్ర, వార్త, సూర్య, ఆంధ్రభూమి పత్రికలలో 25 సంవత్సరాలు పనిచేశారు. పత్రికలకు అనేక వ్యాసాలు రాశారు.

1రచనలు

బొడ్డపాటి చంద్రశేఖర్

1రచనలు

బొడ్డపాటి మురళీధర్

రిటైర్డ్ ఆటో మొబైల్ బ్రాంచి మేనేజర్, కొద్దికాలం లక్ష్మీఫిలింస్ లో పనిచేశారు. పాత తరం సినీ ప్రముఖులతో వ్యక్తిగత పరిచయాలు ఉండేవి. సాహిత్యాభిలాషి.

1రచనలు

మందరపు హైమవతి

స్త్రీవాద కవయిత్రి. ఆవిడ రచనలు నిషిద్ధాక్షరి, నీలి గోరింట, రాతి చెయ్యి కవితా సంపుటాలు. ఆవిడ కవితలు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ, మళయాళ, బెంగాలీ భాషల్లో అనువాదమయ్యాయి. ఆవిడ కవితా సంపుటాలకు ఫ్రీవర్శ్ ఫ్రంట్ అవార్డు, నారాయణ రెడ్డి అవార్డు, శ్రీ కాంత్ శర్మ అవార్డులు వచ్చాయి.సాహిత్య అకాడమీ ఢిల్లీ, గౌహతి, కేరళలో నిర్వహించిన అనేక కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు.

1రచనలు

మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు

స్టేట్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేశారు. అనేక కథలు, కవితలు, వ్యాసాలు రాశారు

1రచనలు

వేమూరి రాజేష్

కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామానికి చెందిన రాజేష్ వేమూరి ప్రింటింగ్ టెక్నాలజీలో పట్టభద్రులై, పోలాండ్ మరియు దుబాయ్‌లో ఉద్యోగ జీవితం కొనసాగించారు. యాత్రలు, చరిత్రపై ఆసక్తితో “నా ఐరోపా యాత్ర”, “మా కాకసస్ యాత్ర” వంటి గ్రంథాలు రచించారు. ఘంటసాల గ్రామ చరిత్ర, విశేషాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రామస్థులకు చేరవేయాలనే లక్ష్యంతో www.managhantasala.net వెబ్‌సైట్‌ను స్థాపించి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం Fortune Pack సంస్థ ద్వారా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు

1రచనలు